అతి మ‌హా సౌరం

అతి త్వర‌లో హైద‌రాబాద్ లో నిర్వహ‌ణ‌

Saturday 13 July 2013

జాత క‌ర్మ అంటే తెలుసునా..!

హైంద‌వ ధ‌ర్మం లో అనేక ప్రక్రియ‌లు ఉంటాయి. వీటి అర్థం తెలుసుకొంటే చాలా బాగుంటుంది.

శిశువు జ‌న్మించ‌గానే వెంట‌నే చేసే ప్రక్రియ ను జాత క‌ర్మ అంటారు. అంటే ప్రస‌వం అయిన‌ప్పుడు శిశువుని బ‌య‌ట‌కు తీసి బొడ్డును క‌త్తిరిస్తారు. ఈ స‌మ‌యంలోనే ఒక మంత్రాన్ని ఉచ్ఛరిస్తూ జాత క‌ర్మ జ‌రిపించాల‌ని చెబుతారు.
** ప్రాంజ్నాది వ‌ర్ధనాత్ పుంసౌ జాత క‌ర్మ విధీయ‌తే-
మంత్రవ‌త్ ప్రాశ‌నం జాస్య హిర‌ణ్య మ‌ధు స‌ర్పిషామ్‌**
అని చెబుతారు. సువ‌ర్ణ పాత్ర లో తేనె లేక నెయ్యి వేసి  కుటుంబ ఆచారాన్ని అనుస‌రించి గృహ్య సూత్రం ప్రకారం వేద మంత్రాన్ని జ‌పిస్తూ ఈ ద్రవాన్ని నాకించాలి. దీంతో శిశువుకి తేజ‌స్సు, లావ‌ణ్యం క‌లుగుతుంద‌ని అర్థం. దీన్నే జాత క‌ర్మ అని పిలుస్తారు. ఈ మ‌ధ్య సిజేరియ‌న్ ఆప‌రేష‌న్ లు జ‌ర‌గుతుండ‌టంతో చాలా మంది దీన్ని మ‌రిచిపోతున్నారు. జాత క‌ర్మ చేయించాక కుటుంబ సాంప్రదాయాన్ని అనుస‌రించి నామ‌క‌ర‌ణ ఇత్యాదులు జ‌రిపించాలి

No comments:

Post a Comment