అతి మ‌హా సౌరం

అతి త్వర‌లో హైద‌రాబాద్ లో నిర్వహ‌ణ‌

Sunday, 28 July 2013

మీ పేరు ప్రాధాన్యం మీకు తెలుసా..!

ప్రతీ వ్యక్తికి త‌న పేరు అంటే చాలా ఇష్టం. ఆ పేరుతో అందరితోనూ పిలిపించుకొంటూ ఉంటారు.ఆ పేరుతో పిలిచిన‌ప్పుడ‌ల్లా తెలీకుండానే శ‌రీరంలోని నాడీ వ్యవ‌స్థ స్పందిస్తు ఉంటుంది. అందుకే పేరుకి స‌నాత‌న ధ‌ర్మంలో అంత‌టి ప్రాధాన్యం ఉంటుంది.
శిశువు జ‌న్మించాక కొద్ది రోజుల‌కు (11 రోజుల‌కు లేదా కుటుంబ సంప్రదాయాన్ని బ‌ట్టి) నామ‌క‌ర‌ణం చేస్తారు. ఈ నామ‌క‌ర‌ణానికి ప్రాధాన్యం ఉంటుంది.
**జాతానంత‌ర మేవ నామ‌క‌ర‌ణ‌మ్ త్వేకాద‌శా హేస్ఫుటం
పుత్ర స్యైవ స‌మాధ‌రంతు యువ‌తేహ‌స్త్ర కార్యం త‌తో వ్యత్యయం
శుద్ధి ర్జాత‌క వ‌చ్ఛనామ్ని స‌క‌లై స్తత్ ద్వాద‌శే షోడ‌శే
ద్వా వింశై వ్యధ వింశ కేహ్ని విహితం జాతి వ్యవ‌స్థాం వినా **
అని పూర్వ కాలామృతం అనే అధ్భుత గ్రంధం లో చెప్పడ‌మైన‌ది. అంటే జాత క‌ర్మ త‌ర్వాత జ‌న్మ న‌క్షత్ర పాదాన్ని బ‌ట్టి పేరుని ఎంచుకోవాలి. ఈ పేరుతోనే శిశువు వృద్ధి చెంది ఆ పేరుని నిల‌బెడ‌తారన్న మాట ఉంది. మ‌గ‌శిశువుకి స‌రి సంఖ్యలో, ఆడ పిల్లకు బేసి సంఖ్య లో పేరు పెట్టడం ఆన‌వాయితీ. శ‌బ్దాన్ని బ‌ట్టి న‌క్షత్ర ప‌రంగా ఉండే ఆయా విలువ‌లు ఆపాదించ‌టం అవుతుంద‌ని న‌మ్మిక‌.

భార‌తీయ స‌మాజంలో దేవుళ్ల పేర్లు - పిల్లల‌కు పెట్టే సాంప్రదాయం ఉంది. ఆ పేరుని ఇంట్లో ప‌దే ప‌దే ఉచ్ఛరించ‌టం తో ఇంట్లో వారంద‌రికీ శుభం క‌లుగుతుంద‌ని చెబుతారు. అంతే గాకుండా భ‌గ‌వంతుని పేరు పెట్టుకొని మంచి మార్గంలో న‌డ‌వాల‌ని ఆకాంక్షిస్తారు. అయితే ఆ పేరు పెట్టుకొని చెడ్డ పేరు తెచ్చే వారు కూడా లేక పోలేదు. అయితే ఆ పేరుతో వ్యవ‌హ‌రిస్తున్నప్పుడు మిగిలిన వారు.. ఆ చెడు న‌డ‌వ‌డిక ను హెచ్చరించాల‌న్నది ఆధ్యాత్మిక స్ఫూర్తి. అందుకే చెడ్డ పేరు తెచ్చుకోకురా బాబూ.. అని మంద‌లిస్తూ ఉంటారు. అలాగే పెద్ద వారి పేరు... పిల్లల‌కు పెడుతుంటారు. ఇది కూడా ఇదే కోవ‌లో అర్థం చేసుకోవాల్సిన సంగ‌తి.
నామ‌క‌ర‌ణం చేసేట‌ప్పుడు చ‌క్కగా ఇష్ట దేవ‌త‌ల్ని పూజిస్తారు. త‌ర్వాత దంప‌తులు శ్వేత బియ్యంలో ఆ పేరుని లిఖించ‌టం ఆన‌వాయితీ. అంతే గాకుండా పెద్ద వాళ్లతో ఆ పేరుతో మొద‌టగా పిల్లల్ని పిలిపిస్తారు. అప్పటినుంచి ఆ పేరుతో శిశువు వృద్ధి లోకి వ‌స్తాడ‌ని ఆశీర్వదిస్తారు.

No comments:

Post a Comment